జగన్మోహన్ రెడ్డి విడుదల చేసిన జీవోను సాంకేతికంగా , రాజకీయంగా విభజించి మాట్లాడాల్సిన అవసరం ఉందన్నారు ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి . సాంకేతికంగా పోతిరెడ్డిపాడు విస్తరణ చేయడం ద్వారా తెలంగాణ కు నష్టం లేదన్నారు .పోతిరెడ్డిపాడు శ్రీశైలం ద్వారా వచ్చే వరద నీటిని ఉపయోగించుకోవడం కోసం మాత్రమే అన్నారు . 841 అడుగుల ఎత్తులో వచ్చే నీటిని మాత్రమే గ్రావిటీ ద్వారా పోతిరెడ్డిపాడుకు తరలించవచ్చని, 841 అడుగుల తక్కువ నీరు ఉంటె పోతిరెడ్డిపాడు కు నీరు వచ్చే అవకాశం లేదన్నారు .పోతిరెడ్డి పాడుకు ఎంత బొక్క పెట్టినా రావాల్సిన నీరు మాత్రమే వస్తాయన్నారు తులసి రెడ్డి . తక్కువ రోజుల్లో ఎక్కువ వరద నీరు వస్తే, ఆ నీటిని తరలించడానికి పోతిరెడ్డిపాడు విస్తరణ ఉపయోగపడుతుందని తొలివెలుగు ఇంటర్వ్యూలో చెప్పారు .
కానీ , సంగమేశ్వరం ద్వారా ప్రతీరోజు 3 టీఎంసీ ల నీటిని లిఫ్ట్ చేయడానికి తలపెట్టిన లిఫ్ట్ మాత్రం కచింతంగా అభ్యంతరం అన్నారు . ఎందుకంటే 805 ఎత్తు ద్వారా నీటిని గ్రావిటీ ద్వారా నీటిని వాడుకోవచ్చు . అదే సమయంలో పాలమూరు రంగారెడ్డి , డిండి ప్రాజెక్ట్ లు కూడా ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మించిన ప్రాజెక్ట్ లే అన్నారు . రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అక్రమమైతే , తెలంగాణ పాలమూరు రంగారెడ్డి , డిండి ప్రాజెక్టులు కూడా అక్రమమే అన్నారు తులసి రెడ్డి .
జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కేవలం రాజకీయ అస్తిత్వం కోసం తీసుకున్న నిర్ణయమన్నారు . రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎవరికీ వారు సెంటిమెంట్ ద్వారా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు . ఇది పూర్తిగా మ్యాచ్ ఫిక్సింగ్ అన్నారు . కాంగ్రెస్ సీనియర్ నేత తులసి రెడ్డి ఇంకా ఏం మాట్లాడారో కింది వీడియో లో చూద్దాం …