ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 831 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 60,726 సాంపిల్స్ ని పరీక్షించగా 831 మంది పాజిటివ్ గా నిర్ధారింపబడ్డారు. మరోవైపు కరోనా మహమ్మారి కారణంగా కృష్ణ లో ఇద్దరు, చిత్తూరు లో ఒక్కరు, తూర్పు గోదావరి లో ఒక్కరు, గుంటూరు లో ఒక్కరు మరియు పశ్చిమ గోదావరి లో ఒక్కరు మరణించారు.
గడచిన 24 గంటల్లో 1,176 మంది కోవిడ్ నుండి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు.
కాగా మొత్తం ఇప్పటివరకు రాష్ట్రంలో 97,88,047 సాంపిల్స్ ని పరీక్షించారు.ఇక గడిచిన 24 గంటలలో అనంతపురంలో 34, చిత్తూరులో 74, తూర్పుగోదావరిలో 126 ,గుంటూరులో 90 కడపలో 37, కృష్ణ లో 145, కర్నూలులో 28 ,నెల్లూరులో 51, ప్రకాశం లో 12, శ్రీకాకుళంలో 23, విశాఖపట్నం 58, విజయనగరం 18, వెస్ట్ గోదావరి 135 కొత్త కేసులు నమోదయ్యాయి.