ఏపీలో కరోనా కేసుల సంఖ్య తగ్గటం లేదు. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 1623 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. మొత్తం 65596 కరోనా పరీక్షలు చేయగా ఈ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇక తాజాగా నమోదు అయిన కేసుల్లో తూర్పుగోదావరి లో అత్యధికంగా..342 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.
మరోవైపు కరోనా నుంచి గడిచిన 24 గంటల్లో 1,340 మంది కొలుకున్నారు. అలాగే 8 మంది మరణించారు. ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,21,325 కి చేరింది. అలాగే 19,92,256 మంది డిశ్చార్జ్ అయ్యారు. 15,158 మంది ఇంకా చికిత్స పొందుతున్నారు.మొత్తం కరోనా మృతుల సంఖ్య 13,911కి చేరింది.