ఏపీలో కరోనా కేసుల సంఖ్య అదే స్థాయిలో నమోదు అవుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 55,307 పరీక్షలు చేయగా… 1,167 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కొత్తగా మరో ఏడుగురు మృతిచెందారు. అలాగే గడిచిన 24 గంటల్లో 1,487 మంది కరోనా నుంచి కొలుకున్నారు.
ఇక తాజా గణాంకాల ప్రకారం మొత్తం 2,80,36,099 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,45,657కు చేరింది. ఇక, రికవరీ కేసులు 20,18,324కు చేరింది. ఇప్పటి వరకు మృతిచెందినవారి సంఖ్య 14,125కు చేరింది. ప్రస్తుతం 13,208 యాక్టివ్ కేసులు ఉన్నాయి.