ఏపీలో కరోనా ఉధృతి భారీగా తగ్గుముఖం పడుతోంది. తెలంగాణ కంటే తక్కువ స్థాయిలో రాష్ట్రంలో కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 64,236 మందికి కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 438 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. కరోనా కారణంగా నిన్న ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు కరోనా బారి నుంచి నిన్న 589 మంది కోలుకున్నారు.
ఏపీలో కరోనా స్వరూపం ఇది-
మొత్తం కరోనా కేసులు- 8,78,723
డిశ్చార్జి అయిన వారి సంఖ్య- 8,67,445
యాక్టివ్ కేసులు-4,202
మరణాల సంఖ్య -7,076