ఏపీలో లో నిత్యం అదే స్థాయిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 55,525 కరోనా టెస్టులు చేయగా… 1,174 మందికి కొత్తగా పాజిటివ్ నిర్ధారణ అయింది. అలాగే గడిచిన 24 గంటల్లో 9
మంది కరోనాతో చనిపోయారు. తాజా గణాంకాల ప్రకారం…మొత్తం కేసుల సంఖ్య 20,37,353కు చేరగా ఇప్పటివరకు 14,061 మంది
ప్రాణాలు కోల్పోయారు.
గత 24 గంటల్లో 1,309 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,653 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య…2037353
యాక్టీవ్ కేసుల సంఖ్య…14653
డిశ్చార్జ్ కేసుల సంఖ్య…2008639
మరణాల సంఖ్య..14061