ఏపీలో ఆయనపై ఎన్నో అవినీతి ఆరోపణలున్నాయి. అత్యంత కీలక పోస్టులో ఆయన చక్రం తిప్పారు. మాజీ మంత్రి యనుమలకు స్వయంగా అల్లుడు కావటంతో… ఆయనకు తిరుగు లేకుండా పోయింది. కానీ ఆ అధికారికి వైసీపీ సర్కార్‌లోనూ ఎదురు లేకుండా పోయిందన్న చర్చ ఊపందుకుంది. వారి బంధువైన తెలంగాణ మంత్రి అండతో ఆయన చక్రం తిప్పుతున్నారని గుసగుసలు వినపడుతున్నాయి.
ఐఆర్ఎస్ ఉద్యోగి అయిన మాజీ మంత్రి యనుమల అల్లుడు టీడీపీ హాయంలో డిప్యూటేషన్‌పై ఏపీకి వచ్చారు. ఏపీ మెడికల్ ఇన్ఫాస్ట్రక్చర్ కార్పోరేషన్ ఎండీగా పనిచేశారు. అయితే ఆ కార్పోరేషన్ పలు ప్రాజెక్టుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఏసీబీ ప్రాథమికంగా నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. దాదాపు 18కోట్ల మేర అవినీతి ఉందని…సీఐడీకి సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. అయితే… ఆ సిఫార్సు చాలా రోజులుగా పెండింగ్‌లోనే ఉన్నట్లు తెలుస్తోంది.
అవినీతిని సహించేది లేదని వైఎస్ జగన్ ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. పైగా… టీడీపీ హాయంలో అవినీతి అనగానే వెంటనే రంగంలోకి దిగిపోయి ఆ అధికారిని సస్పెండ్ చేసి, విచారణ చేయించటం జరుగుతుంది. కానీ యనుమల అల్లుడు గోపినాథ్ విషయంలో మాత్రం అలాంటిదేమీ జరగటం లేదు. ఐఆర్‌ఎస్ క్రిష్ణకిషోర్ వ్యవహరంలో ప్రభుత్వం వ్యహరించిన తీరుకు, ఇప్పుడు వ్యవహరిస్తున్న తీరుకు ఎంతో తేడా ఉంది.
యనుమల అల్లుడు విషయంలో… తెలంగాణ మంత్రి జోక్యం చేసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాజీ మంత్రి యనుమలకు, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌కు బంధుత్వం ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. దీంతో… తలసాని చొరవతో సదరు అధికారిపై ఏపీ సర్కార్ చూసి చూడనట్లు వ్యవహరిస్తోందన్న ఆరోపణలు వినిపస్తున్నాయి.