ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే అగ్రిగోల్డ్ బాధితులకు రు.1150 కోట్లు చెల్లిస్తానని, మరో 6 నెలల్లో మిగిలిన మొత్తం వడ్డీతో సహా చెల్లిస్తామని హామీ ఇచ్చారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. అగ్రిగోల్డ్ ఆస్తులను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని భవిష్యత్తు అవసరాలకు ఉపయోగించుకోవాలి. ఇప్పటికే పలువురు అగ్రిగోల్డ్ బాధితులు ఆర్థిక, మానసిక ఒత్తిడితో ఆత్మహత్యలకు, అసహజ మరణాలకు పాల్పడ్డారని రామకృష్ణ లేఖలో పేర్కొన్నారు.
అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ అసోసియేషన్ ఆధ్వర్యంలో నేడు రేపు రాష్ట్ర వ్యాప్తంగా దీక్షలకు సిద్ధం అయ్యారు.మీరు బడ్జెట్ లో కేటాయించిన సొమ్మును అగ్రిగోల్డ్ బాధితులకు అందచేసి వారికి న్యాయం చేస్తారని కోరుతున్నానంటూ లేఖ లో పేర్కొన్నారు.