పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీటిని తరలించాలని జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన 203 జీవోతో గొడవలు తప్ప రాయలసీమకు నీళ్లు రావన్నారు ఏపీ సిపిఎం సీనియర్ నాయకులు గఫుర్ .పోతిరెడ్డిపాడు ద్వారా రావాల్సిన నీరే సరిగ్గా రావట్లేదని , లేని నీటి కోసం ఈ జీవోలు ఎందుకని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు . రాయలసీమను సస్యశ్యామలం చేయాలంటే ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయన్నారు .సిపిఎం నాయకులూ గఫుర్ తొలివెలుగు తో మాట్లాడారు .
ఇదంతా రెండు రాష్ట్రాల్లో ఉన్న సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే అన్నారు . టీఆరెస్ , వైసీపీ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని , కెసిఆర్ కు తెలీకుండా జీవో వచ్చిందనడం హాస్యాస్పదం అన్నారు . తెలంగాణ కంటే రాయలసీమ వెనుకబడిందని ఇప్పటికైనా మంచి వాతావరణం లో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు . దీని ద్వారా తెలంగాణ , ఆంధ్ర సెంటిమెంట్ తీసుకొచ్చి రాజకీయం చేస్తే ప్రజలు క్షమించరన్నారు .