ఏపీ సీఎస్ ఆకస్మిక బదిలీ... ఎందుకంటే? - Tolivelugu

ఏపీ సీఎస్ ఆకస్మిక బదిలీ… ఎందుకంటే?

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంవో ముఖ్య కార్యదర్శి… ఈ ఇద్దరు సీఎంకు రెండు కళ్లలాంటి వారు. ఈ ఇద్దరు అధికారుల పనితీరుపైనే సీఎం, ఆయన కార్యాలయం ప్రధానంగా ఆధారపడుతుంది. అలాంటిది ఈ ఇద్దరి నేతల మధ్యే విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఏపీ సీఎంవోలో తాజా గొడవతో… సీఎం ఆగ్రహంతో సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేశారు.

ఇటీవల క్యాబినెట్‌కు ముందు వైఎస్‌ఆర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్స్‌కు సంబంధించిన ఓ ఫైల్‌ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యంకు చేరింది. దీన్ని ఆయన ఫైనాన్స్‌ అనుమతితో రీ సర్క్యులేట్ చేయమని ఆదేశించారు. కానీ జీఏడీ పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు కూడా చూస్తున్న ప్రవీణ్ ప్రకాష్‌ అవేవీ పట్టించుకోకుండా… సీఎం అనుమతి లేకుండానే క్యాబినెట్ ముందు ఫైల్ పెట్టారు. మరో ఫైల్‌లోనూ ఇదే గొడవ జరిగినట్లు తెలుస్తోంది. గ్రామ న్యాయాలయాల ఫైల్‌ క్యాబినెట్ ముందు పెట్టాలని సంబంధిత శాఖ కార్యదర్శి సీఎం పర్మిషన్‌ కూడా తీసుకున్నా… ప్రవీణ్ ప్రకాష్ ఆ ఫైల్ తన దగ్గరే పెట్టుకొని, క్యాబినెట్‌ ముందుకు తెలేదు. దాంతో సీఎస్‌ ఆగ్రహంతో ప్రవీణ్ ప్రకాష్‌కు మెమో జారీ చేశారు. దురుద్దేశపూర్వకంగానే… సీఎంవో ముఖ్యకార్యదర్శి ఇలా వ్యవహరిస్తున్నారని ప్రచారం ఊపందుకుంది. ఇటీవలే ఓ అధికారి నేను ప్రవీణ్ ప్రకాష్‌ దగ్గర పనిచేయలేనని, నన్ను ఇతర శాఖకు బదిలీ చేయాలని సీఎస్‌కు లేఖ కూడా రాశారని సచివాలయ వర్గాల సమాచారం. దీంతో సచివాలయంలో ఏ ఇద్దరు ఉన్నతాధికారులు ఎదురుపడ్డా ఈ వ్యవహరమే చర్చిస్తున్నారు.

దీంతో ఘటనపై సీరీయస్ అయిన సీఎం జగన్… సీఎస్‌ను బదిలీ చేశారు. హెచ్చార్డీకి సీఎస్‌ను ఎల్వీ సుబ్రమణ్యాన్ని బదిలీ చేశారు. బిజినెస్ రూల్స్ మార్పు విషయంలోనూ ప్రవీణ్ ప్రకాశ్-ఎల్వీ మధ్య మనస్పర్ధలు వచ్చినట్లు తెలుస్తోంది.

AP CS LV Subramanyam Sudden Transferred To HRDA Director, ఏపీ సీఎస్ ఆకస్మిక బదిలీ… ఎందుకంటే?

Share on facebook
Share on twitter
Share on whatsapp