విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలోనే కొత్త జిల్లాలు ఏర్పాటు కాబోతున్నాయనే ప్రచారంలో నిజం లేదని డిప్యూటీ సీఎం పిల్లి సుభాష్ చంద్రబోస్ చెప్పారు. కొత్త జిల్లాల ఆలోచన చేయడమే లేదని మీడియా ద్వారా క్లారిటీ ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాతే దీనిపై ప్రభుత్వం ఆలోచిస్తుందని తెలిపారు. ఈనెల 17 తేదీ నుంచి జిల్లాల వారీగా రెవెన్యూ సదస్సులు జరుపుతున్నామని, ఈ సదస్సులో ఇళ్ల స్థలాలపై పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు గుర్తించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు జరుపుతామని అన్నారు. రాష్ట్రంలో భూముల రీసర్వే కోసం రూ. 1800 కోట్లు ఖర్చు చేస్తున్నామని, డెన్మార్క్ లాంటి దేశాల్లో రీసర్వే విధానాల అధ్యయనానికి అధికారులను పంపించాలని భావిస్తున్నామని చెప్పారు