ప్రభుత్వ ఆదేశాల మేరకు లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించిన రోడ్డు మీదకు వచ్చిన వాహనాలను పోలీసులు సీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే పోలీసులు స్వాధీనం చేసుకున్న వాహనాలను తిరిగి పొందవచ్చుని ఏపీ డిజిపి గౌతమ్ అన్నారు. వాహనాలకు సంబంధించిన సరైన ధ్రువపత్రాలను సంబంధిత పోలీస్ స్టేషన్ లో సమర్పించాల్సి ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. ఆ మేరకు ఇప్పటికే జిల్లా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. వాహన యజమానులు సంబంధిత పోలీస్ స్టేషన్ లో సంబంధిత పేపర్లతో వెళ్తే మీ వాహనాలను పొందవచ్చని డిజిపి తెలిపారు.