విశాఖ ఎల్జీ పాలిమర్స్ విషయమై డి జి పి గౌతమ్ సవాంగ్ మీడియా తో మాట్లాడారు. ప్రస్తుతం ఎల్జీ పాలిమర్స్ నందు పొల్యూషన్ లెవెల్ అనుకున్న స్థాయిలో ఉన్నాయంటూ తెలిపారు. రానున్న 48 గంటల వరకు ఐదు గ్రామాల ప్రజలు ప్రభుత్వం కల్పించిన వసతి నందు మాత్రమే ఉండాలన్నారు. పొల్యూషన్ కు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, గ్యాస్ ను కట్టడిచేసే బృందాలు చేరుకుంటాయని తెలిపారు. ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావద్దని డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. కంపెనీపై అన్ని విధాలుగా చర్యలు తీసుకుంటామన్నరు.