ఏపీలో కరోనా వైరస్ అల్లకల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసులు రోజుకో కొత్త రికార్డ్ సృష్టిస్తున్నాయి. అయితే ఈ రికార్డ్ ఇక్కడితోనే ఆగిపోలేదు. దేశంలో అత్యధికంగా కరోనాతో ప్రభావితమైన జిల్లాల్లో ఇప్పుడు ఏపీవే అధికంగా కనిపిస్తున్నాయి. ఒకటి కాదు.. రెండు కాదు.. మోస్ట్ కరోనా ఎఫెక్టెడ్ టాప్-30 జిల్లాల్లో ఏకంగా ఏపీకి చెందిన 12 జిల్లాలు ఉండటం కలవరం రేపుతోంది.
రోజువారీగా అత్యధిక కేసులు నమోదవుతున్న టాప్-10 జిల్లాల్లో తూర్పుగోదావరి, నెల్లూరు ఉండగా.. టాప్-15లో కడప, విశాఖ, ప్రకాశం, అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాలు చోటు సంపాదించుకున్నాయి. ఇక టాప్-30లో చిత్తూరు, కర్నూలు, విజయనగరం, గుంటూరు, శ్రీకాకుళం జిల్లాల పేర్లు ఉన్నాయి. ఇలా మొత్తంగా టాప్-30 జిల్లాల్లో.. ఏపీలోని 12 జిల్లాలు ఉండటం ఆందోళన కలిగిస్తోంది.