ఏపీలో పంచాయితీ ఎన్నికలు పూర్తవ్వగానే… మున్సిపల్ ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఈమేరకు ఏపీ ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. రాష్ట్రఃలో ఉన్న 12 మున్సిపల్ కార్పోరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయి.
మార్చి 10న పోలింగ్ జరగనుండగా, మార్చి 14న ఫలితాలు విడుదల చేయబోతున్నారు. ఒకే దశలో ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ డిసైడ్ అయ్యింది. గతంలో ఎక్కడి నుండి అయితే ఎన్నికల ప్రక్రియ కరోనా నుండి ఆగిపోయిందో… అక్కడి నుండే ఎన్నికల ప్రక్రియ మొదలుకానుంది.
ఇప్పటికే పంచాయితీ ఎన్నికల నిర్వహణపై ఏపీ ప్రభుత్వం, ఎస్ఈసీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో… మున్సిపల్ ఎన్నికలు మరింత హీట్ పుట్టించబోతున్నాయి.