ఏపీలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ విషయంలో ప్రభుత్వం- ఎన్నికల కమిషన్ మధ్య పోరు కొనసాగుతూనే ఉంది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ పట్టుదలగా ఉండగా, ఇప్పట్లో ఎన్నికలు వద్దంటూ సర్కార్ అదే వైఖరిని అవలంభిస్తుంది. ఈ విషయంలో ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గవర్నర్ ను కలిసినా పెద్దగా ఫలితం లేకుండా పోయింది.
దీంతో తను ప్రభుత్వంతో ఏ మాట్లాడదల్చుకున్నా అధికారిక లేఖల ద్వారానే సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా సీఎస్ నీలం సాహ్నికి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో లేఖ రాశారు. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని కమిషన్ నిర్ణయించినందున… వోటర్ రోల్స్ ను తయారు చేయించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ఈ లేఖలో ఏపీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ ఆయన ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పేర్కొన్నట్లు సమాచారం.
గతంలో కమిషనర్ లేఖలను పెద్దగా పరిగణలోకి తీసుకున్నట్లు కనపడని సీఎస్… ఈసారి ఏవిధంగా జవాబిస్తారో చూడాలి.