ఏపీలో స్థానిక సంస్థల నిర్వహణపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన స్టేను ద్విసభ్య బెంచ్ కొట్టివేసింది. ఎన్నికలు నిర్వహించాల్సిందేనని, అందుకు ప్రభుత్వం సహాకరించాలని విస్పష్టమైన తీర్పునిచ్చింది. రాజ్యాంగం ప్రకారం ఎన్నికలు జరగాల్సిందేనని అభిప్రాయపడింది.
ఏపీ హైకోర్టు తాజా తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం స్పందించింది. గతంలో విడుదల చేసిన షెడ్యూల్ ప్రకారం… వచ్చే నెల 5, 9, 13, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తామని కోర్టుకు ప్రభుత్వం తెలిపినట్లు వెల్లడించింది. త్వరలో సీఎస్, డీజీపీ, కలెక్టర్లు, ఎస్పీలతో సమావేశమవనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఎన్నికల సంఘం అధికారిక ప్రకటన విడుదల చేసింది.