ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ చేరేందుకు నిర్వహించిన ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీ ఈఏపీసెట్ పరీక్షల ఫలితాలను మంత్రి ఆదిమూలపు విడుదల చేశారు. ఈ పరీక్షను గతంలో ఎంసెట్ గా పిలిచేవారు. మూడు విడతలుగా నిర్వహించిన ఈ ప్రవేశ పరీక్షలు మంగళవారంతో ముగిశాయి.
ఈ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 78,066మంది హజరయ్యారు. ముందుగా ఇంజనీరింగ్ ప్రవేశాలు ఆ తర్వాత అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలు ఉండనున్నాయి.
వైద్యవిద్యలో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నీట్ పరీక్ష నిర్వహిస్తున్నందున.. ఎంసెట్ లో ఎం అనే అక్షరాన్ని తొలగించారు. ఫార్మసీ ప్రవేశాలను ఈ పరీక్షతోనే భర్తీ చేస్తున్నందున ఎం ప్లేసులో పీ అనే అక్షరాన్ని చేర్చారు. దీంతో ఈ పరీక్ష పేరు ఈఏపీసెట్ గా మారింది.