గుంటూరు: మద్యంషాపుల పనివేళలను కుదించిన ప్రభుత్వం ఇక బార్ల సమయాన్ని కూడా తగ్గించాలని భావిస్తోంది. ఇప్పటికే బార్ల సమయాన్నీ తగ్గించేద్దామని ఎక్సైజ్ శాఖ ప్రతిపాదించినట్టు సమాచారం. ప్రస్తుతం బార్ల పనివేళలు ఉదయం 10 నుంచి రాత్రి 11గంటల వరకూ ఉన్నాయి. రాత్రి 11 వరకూ మద్యం అమ్మకాలు జరిపేందుకు వీలుండగా, 12 వరకు ఫుడ్ సర్వింగ్‌కు అనుమతి ఉంది. కానీ, చాలా బార్లలో రాత్రి 12 వరకూ మద్యమే అమ్ముతున్నారు. దీనిపై ఎక్సైజ్‌శాఖ పర్యవేక్షణ కూడా కష్టమవుతోంది. పైగా ఇటీవల షాపుల సమయాన్ని ఒకేసారి మూడు గంటలు తగ్గించడం వల్ల బార్లకు కూడా తగ్గించాలనే డిమాండ్లు పెరిగాయి. దీనిపై ఎక్సైజ్‌శాఖ కసరత్తు చేస్తోంది.