కేసీఆర్ జాతీయ ప్రకటన సందర్భంగా తెలంగాణ భవన్ పరిసరాలు గులాబీమయం అయ్యాయి. నేతలు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. జై కేసీఆర్ నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది. అయితే, తెలంగాణ భవన్ వద్ద ఏపీకి చెందిన ఓ రైతు హల్ చల్ చేశాడు.
గుంటూరుకు చెందిన రైతు కేసీఆర్ కు అభిమాని. తనతోపాటు మూడు ఖాళీ మద్యం బాటిల్స్ ను తీసుకొచ్చాడు. వాటిలో గులాబీ కలర్ దారంతో తయారు చేసిన కారు, కుర్చీ, మంచం ఉన్నాయి. కేసీఆర్ కు గిఫ్ట్ గా వీటిని ఇచ్చేందుకు వచ్చానని తెలిపాడు ఆ రైతు.
మరోవైపు టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం కవరేజ్ కు మీడియాను అనుమతించ లేదు. మధ్యాహ్నం ప్రెస్ మీట్ ఉంటే చెప్తామంటూ తెలంగాణ భవన్ నుంచి మీడియాను బయటికి పంపారు. సీఎం ఆదేశాలతోనే బయటికి పంపామని టీఆర్ఎస్ నేతలు అంటున్నారు. తెలంగాణ భవన్ బయట రోడ్డుపైనే మీడియా ప్రతినిధులు నిలబడి ఉన్నారు.