గుంటూరు: ఏపీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం మంగళవారం నరసరావుపేట మొదటి అదనపు మున్సిఫ్ మేజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కోడెల, ఆయన కుటుంబంపై కేసులు నమోదుచేసి వేధిస్తున్నట్టుగా ప్రతిపక్షం ఆరోపిస్తోంది. వైసీపీ వేధింపులతో మనస్థాపం చెందిన శివప్రసాదరావు ఆత్మహత్య చేసుకున్నారు.
ప్రధానంగా అసెంబ్లీలో ఫర్నిచర్ తరలించుకుపోయారని కోడెల కుటుంబంపై వున్న ఆరోపణ. కె ట్యాక్స్ పేరుతో మరికొన్ని ఆరోపణలు, అభియోగాలను శివరాం ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల్లో తాను ఎలాంటి తప్పు చేయలేదని చెబుతూ కోడెల తనయుడు శివరాం ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.