తన స్వగ్రామం నారావారి పల్లెలో జరిగిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నెంబర్ 1ని భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. ప్రజలపై పన్నులు, ఛార్జీలు వేస్తూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని బాబు మండి పడ్డారు. జగన్ పాలనతో ఏపీ బ్రాండ్ పూర్తిగా దెబ్బతిన్నదని ఆరోపించారు.
రాజకీయాల్లో ఉండేందుకు జగన్ కు అర్హత లేదన్నారు బాబు. తాను ప్రజల భవిష్యత్ కోసం బతుకుతున్నానని బాబు అన్నారు. భారత దేశ గొప్ప సంపద యువత అని అన్నారు. 2047 వరకు ఒక విజన్ సిద్ధం చేసుకోవాలని ఇటీవల జీ 20 చర్చల సందర్భంగా ప్రధానికి సూచించినట్టు చంద్రబాబు చెప్పారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆధ్వర్యంలో భోగి వేడుకలను నిర్వహించి.. టీడీపీ నేతలు, శ్రేణులు పాల్గొన్నారు.
వేడుకలను నిర్వహించిన అనంతరం భోగి మంటల్లో జీవో నెంబర్ కాపీలను వేసి దగ్దం చేశారు. అవసరం లేని వస్తువులను తగలబెట్టినట్లు.. అవసరం లేని చీకటి జీవోను మంటల్లో వేసినట్లు టీడీపీ నేతలు పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీ నేతల, పార్టీల గొంతు నొక్కడానికే ప్రభుత్వం జీవో నెంబర్ వన్ ను తీసుకొచ్చినట్లు ఆరోపణలున్నాయి. జీవో నెంబర్ వన్ ను రద్దు చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలో రానున్న అధికార పార్టీ తప్ప మిగతా పార్టీలన్నీ జీవో నెంబర్ వన్ ను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు.
జీవో నెంబర్ వన్ ను రద్దు చేయాలని నిరసనగా.. భోగి పండగ రోజు టీడీపీ నేతలు జీవో నెంబర్ వన్ కాపీలను భోగి మంటల్లో వేసి కాల్చారు. పాత వస్తువులను భోగి మంటల్లో వేసినట్టుగానే.. జీవో నెంబర్ వన్ కాపీలను భోగి మంటల్లో వేసినట్లు టీడీపీ తెలిపింది. రాష్ట్రంలో సైకో పాలన పోయి సైకిల్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారని టీడీపీ నేతలన్నారు.