నిరుద్యోగ యువతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ వినిపించింది. ఫ్యామిలీ వెల్ఫేర్, పబ్లిక్ హెల్త్ విభాగాల్లో ఉద్యోగ భర్తీకి ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు 1113 మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ల పోస్టుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. జోన్ల వారీగా కాంట్రాక్టు పద్దతితో ఈ పోస్టులను భర్తీ చెయ్యనున్నారు. అర్హత ఉన్న అభ్యర్థులు నవంబర్ 29 తేదీ లోపు ఆన్ లైన్ లలో అప్లై చేసుకోవాలి.
మిడ్ లెవల్ హెల్త్ ప్రొవైడర్లు
ఖాళీల సంఖ్య: 1113
కాంట్రాక్ట్ వ్యవధి: ఏడాది.
అర్హత: బీఎస్సీ(నర్సింగ్) డిగ్రీ
వయోపరిమితి: 35 సంవత్సరాలలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులైతే 40 సంవత్సరాలలోపు ఉండాలి. * దరఖాస్తు విధానం: ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు: రూ.300. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మినహాయింపు.
సెలెక్షన్ విధానం:రాతపరీక్ష ద్వారా నియామకం. ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నవారికి డిసెంబర్ 10న ఆన్‌లైన్ పరీక్ష. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కర్నూలులో పరీక్ష కేంద్రాలు.
పరీక్ష విధానం:
ఆన్‌లైన్ పరీక్ష. 200 మల్టీపుల్ చాయిస్ ప్రశ్నలు.
బీఎస్సీ(నర్సింగ్) సిలబస్ నుంచి ప్రశ్నలు. పరీక్ష సమయం 3 గంటలు.
పరీక్షకు హాజరయ్యేవారు హాల్ టికెట్‌తోపాటు ఏదైనా ఒరిజినల్ గుర్తింపు కార్డును తీసుకెళ్లాలి.
పరీక్షలో అర్హత మార్కులను ఓసీలకు 50%, దివ్యాంగులకు 45%, ఎస్సీ-ఎస్టీలకు 40%.
శిక్షణ ఇలా: రాత పరీక్షల్లో అర్హత సాధించినవారికి 6 నెలల శిక్షణ. 2020 జనవరి 1 నుంచి ఇగ్నో కేంద్రాల్లో బ్రిడ్జి ప్రోగ్రామ్ (సర్టిఫికేట్) శిక్షణ కార్యక్రమం. ఆ తర్వాత రాష్ట్రంలోని ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో ఉద్యోగాల్లో నియామకం.
సాలరీ : నెలకు రూ.25వేలు
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 17.11.2019.
దరఖాస్తుకు చివరితేది: 29.11.2019.
ప్రవేశ పరీక్ష తేదీ: 10.12.2019.
బ్రిడ్జ్ కోర్సు కౌన్సిలింగ్: 23.12.2019.
బ్రిడ్జ్ కోర్సు ప్రారంభం: 01.01.2020.