విజయవాడ: పిల్లలకి వరుసగా వారంరోజులు సెలవులొచ్చాయి. గ్రామ సచివాలయ పోస్టుల పరీక్షల సందర్భంగా ఏపీలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలకు ఏడు రోజులు సెలవులు ప్రకటించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 1నుంచి 8వ తేదీ వరకూ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు నిర్వహిస్తున్నారు. దాంతో ఫస్టు తారీఖు నుంచి 8వ తేదీ వరకు మొత్తం ఆరురోజుల పాటు స్థానిక సెలవులు ప్రకటిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారే. కొన్ని జిల్లాల్లో దీనికి అదనంగా మరికొన్ని సెలవులు ప్రకటించారు. డీఎస్సీ పోస్టుల భర్తీకి పరీక్షలు జరుగుతుండటంతో వాటి ప్రారంభానికి ముందురోజు కూడా స్థానిక సెలవు ప్రకటించారు. దీంతో మరోరోజు సెలవు ఇచ్చినట్లయింది.