తమిళనాడు కూనూరు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన సాయితేజ అనే జవాన్ కూడా ఉన్న విషయం తెలిసిందే. సాయితేజ్ కుటుంబానికి ఏపీ ప్రభుత్వం 50 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ విషయాన్ని సీఎంఓ ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.
సాయితేజ్.. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్‌కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్‌గా పనిచేశారు. బుధవారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో రావత్ , ఆయన భార్య మధులిక రావత్ సహా మొత్తం 13 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మరణించిన సాయితేజ్ మృతదేహాన్ని డీఎన్ఏ పరీక్షల సహాయంతో గుర్తించారు. మృతదేహం స్వగ్రామానికి రానుంది. అనంతరం కుటుంబ సభ్యులు సాయితేజ్ అంత్యక్రియలు నిర్వహిస్తారు.