ఏపీలో మరోసారి ఉద్యోగాల జాతరకు తెర లేవనుంది. ఇప్పటికే గ్రామ వాలంటీర్లు, వార్డు వాలంటీర్ల నియామకాలు జరగ్గా… అంగన్‌వాడీ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల భర్తీ కొనసాగుతోంది.
తాజాగా నిరుద్యోగులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వచ్చె నెలలో మెగా డీఎస్సీ నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ప్రభుత్వం ప్రకటించింది. కొత్త ఏడాదిలో నిరుద్యోగులకు కానుక ఇవ్వబోతున్నామని… దాదాపు 8000పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాకాలు చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అసెంబ్లీలో ప్రకటించారు.
అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో… ఎమ్మెల్యే ఆర్కే అడిగిన ప్రశ్నకు సమాధానంగా వచ్చె నెలలోనే మెగా డీఎస్సీకి ప్లాన్ చేసినట్లు తెలిపారు.
రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో మూడోసారి డీఎస్సీ చేపట్టబోతున్నారు. తెలంగాణలో ఇప్పటి వరకు ఒకే డీఎస్సీని నిర్వహించారు.
సైబరాబాద్ పోలీసులకు వాట్సాప్ షాక్
ఉడుకు నీళ్లు పోసి కొడతారా…?: చెన్నకేశవులు భార్య
ఇక నుంచి పెళ్లి కానీ జంట ఒకే గది లో ఉండటం తప్పు కాదట : మద్రాసు హైకోర్టు