త్వరలోనే ఏపీలో స్కూల్స్ ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు టీకాలు వేసుకోని టీచర్లు, స్కూల్స్ లో పనిచేసే సిబ్బంది ఎవరైనా ఉంటే.. ముందుగా వారికి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కరోనా నియంత్రణ, వ్యాక్సినేషన్ పై సీఎం జగన్ సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఇక ఆరోగ్యశ్రీ కార్డు క్యూఆర్ కోడ్ రూపంలో నమోదు చేయాలని ఆదేశించారు జగన్. ఆ కోడ్‌ను స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల వివరాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. అలాగే ఆరోగ్యశ్రీని కూడా ఆధార్ తో అనుసంధానం చేయాలన్నారు. నిత్యం ప్రజలను కలిసే ప్రభుత్వ ఉద్యోగులందరూ టీకాలు వేసుకోవాలని సూచించారు జగన్.