మద్యం ప్రియులకు ఏపీ సర్కార్ షాక్ - Tolivelugu

మద్యం ప్రియులకు ఏపీ సర్కార్ షాక్

Ap govt another step to stop liquor in the state with reducing the bars number up to 50 percent, మద్యం ప్రియులకు ఏపీ సర్కార్ షాక్

ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే భారీగా మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించిన జగన్ సర్కార్, ఇప్పుడు బార్లపై పడింది. ఇప్పటికే బార్ల టైమింగ్స్‌ను మార్చేయగా… ఇప్పుడు బార్ల సంఖ్యను కూడా సగానికి తగ్గించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

రాష్ట్రంలో స్టార్‌ హోటళ్లు కాకుండా 798 బార్లున్నాయి. ఇందులో సగం తగ్గించే అవకాశాలను ఎక్సైజ్ శాఖ తీవ్రంగా కసరత్తు చేస్తోందని… పైగా మిగిలిన బార్లలో కూడా మద్యం ధరలను భారీగా పెంచేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక బార్లను కూడా లాటరీ పద్దతిలో కొత్త బార్లను మంజూరు చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు అధికారులు.

ఎన్నికలకు ముందు మద్యపాన నిషేధం చేస్తానని హమీ ఇచ్చిన జగన్… ఆ హమీని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఒక్కో అడుగు వేస్తున్నారని… వైసీపీ సర్కార్‌ బలంగా ప్రచారం చేసుకుంటుంది.

Share on facebook
Share on twitter
Share on whatsapp