అమరావతితో పాటు రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి ప్రాజెక్టులపై అధ్యయనానికి నిపుణుల కమిటీని నియమించిన ఏపీ ప్రభుత్వం
పట్టణ ప్రణాళికారంగంలో నిపుణులైన ఏడుగురితో కమిటీ ఏర్పాటు
గుంటూరు: అమరావతి రాజధానిగా వుంటుందా.. పోతుందా అనే బిగ్ కాంట్రవర్సీకి మరింత ఆజ్యం పోస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది. ఈ కమిటీలో సభ్యులుగా ప్రొఫెసర్ మహావీర్, డాక్టర్ అంజలీ మోహన్, ప్రొఫెసర్ శివానందస్వామి, ప్రొఫెసర్ కేటీ రవీంద్రన్, డాక్టర్ కేవీ అరుణాచలం ఉంటారు. పర్యావరణ, వరదల నియంత్రణలో నిపుణులైన మరొకరిని కమిటీలో కో ఆప్షన్ సభ్యుడిగా తీసుకోవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిపుణుల కమిటీ కన్వీనర్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జీఎన్ రావు వ్యవహరించనున్నారు. కమిటీ ఆరువారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. అమరావతిపై పెద్దఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ కమిటీ నియామకానికి ప్రాధాన్యత ఉంది.