మద్యం, ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ను ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఎన్ఫోర్స్మెంట్ టీం డీజీపీ ఆధ్వర్యంలో పనిచేయనున్నారు.ఇందుకోసం ప్రత్యేక కమిషనరేట్ కూడా ఏర్పాటు చేశారు.
ఐ జి, అంతకంటే పై స్థాయి అధికారిని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో కమిషనర్ గా ప్రభుత్వం నిర్ణయించనుంది. మొత్తం 18 పోలీస్ యూనిట్లలో అడిషనల్ ఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారులను నియమించనున్నారు.18 మందిలో 7 ఐపిఎస్ అధికారులు ఉండనున్నారు.ఈ మేరకు అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.