అవును. ఏపీలోకి సీబీఐ ఎంటైరపోయింది. చంద్రబాబు పాలనలో సీబీఐని రాష్ట్రంలోని రానిచ్చేది లేదంటూ చంద్రబాబు తెచ్చిన జీవోను సీఎం జగన్ పక్కనపెట్టేశారు. దాంతో ఏపీలో పనిచేసే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల అవినీతిపై విచారించే అవకాశం సీబీఐకి కల్పించినట్లయింది.
సీబీఐ రాష్ట్రంలో అవినీతిని విచారించాలా వద్దా అనేది రాష్ట్ర పరిధిలోని అంశం అని…. కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తూ సీబీఐని వాడుకుంటుందని ఆరోపిస్తూ సీబీఐకి ఏపీలోకి ఎంటర్ కాకుండా జీవో జారీ చేయగా, ప్రస్తుతం సీఎం జగన్ దాన్ని పక్కనపెట్టేశారు. గతంలో ఏసీబీకి ఉన్న అధికారాన్ని తిరిగి సీబీఐకే అప్పగిస్తు నిర్ణయం తీసుకున్నారు.
మహా ట్విస్ట్- మోడీకి ఉద్ధవ్ థాక్రే ఫోన్
అంతేకాదు… ఈ మధ్యకాలంలో కేంద్రప్రభుత్వ ఉద్యోగులపై వచ్చిన అవినీతి ఆరోపణల కేసును తిరిగి సీబీఐకే బదలాయించే అవకాశం ఉంది.