ఏపీలో కరోనా వైరస్ ఇప్పటి వరకు అయితే కంట్రోల్ లోనే ఉంది. కానీ క్రమేపీ రాష్ట్రంలోనూ పెరిగే సూచనలు కనిపిస్తుండటంతో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఏపీలో ఇప్పటికే విద్యాసంస్థలు పూర్తిగా మూసివేశారు. రాష్ట్ర విద్యాశాఖ దాదాపు ఇంటికే పరిమితం అయ్యింది. కానీ ఇప్పట్లో పరిస్థితులు మెరుగుపడే అవకాశం కనిపించటం లేదు. దీంతో… ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆరవ తరగతి నుండి తొమ్మిదవ తరగతి వరకు ఉండే వార్షిక పరీక్షలను పూర్తిగా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పై తరగతులకు పంపించేలా ఆదేశాలు జారీ చేయనుంది.
దీంతో… జూన్ లో తిరిగి బడులు మొదలయ్యే వరకు ఇక స్కూల్స్ పూర్తిగా మూసివేసినట్లే.