ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభంకానున్నాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. జులై నెలాఖరులోగా మొదటి విడతలో చేపట్టిన 15,715 స్కూళ్లలో నాడు–నేడు కింద అభివృద్ధి పనులు పూర్తిచేయాల్సి ఉందన్నారు. 9 రకాల సదుపాలను కల్పించాల్సి ఉంది. దీనికి సంబంధించి రూ.456 కోట్ల రివాల్వింగ్ ఫండ్ కూడా విడుదల చేశామన్నారు. జులై నెలాఖరు కల్లా అన్ని స్కూళ్లలో పనులు పూర్తి కావాలంటే.. కలెక్టర్లు ప్రతిరోజూ రివ్యూ చేయాలన్నారు. ఈ పనులకోసం సిమెంటు, ఇసుక సరఫరాకు ఇబ్బందులు లేకుండా చూడాలని జగన్ తెలిపారు.