ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోయాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ ప్రభుత్వం కీలక శాఖలను ఎస్మా పరిధిలోకి తెస్తూ నిర్ణయం తీసుకుంది.
ఎస్మా పరిధిలోకి వైద్య పరికరాల తయారీ, వైద్యం, పారిశుద్యం, రవాణా వంటి రంగాలను కొత్తగా తీసుకొచ్చింది. తద్వారా వైద్యం నిరాకరించటానికి వైద్యులకు, పారిశుద్య కార్మికులకు పని చేయకుండా సమ్మెకు కానీ, దీర్ఘకాలిక సెలవుల్లోకి కానీ వెళ్లకుండా ఎస్మా ప్రయోగించింది.
ప్రస్తుతం కరోనా వైరస్ ఏపీలో విశ్వరూపం చూపిస్తోంది. ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో… ఏపీలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోయాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా ఏపీ సర్కార్ ఎస్మా పరిధిలోకి మరిన్ని ప్రబుత్వ శాఖలను తీసకొచ్చింది.