ఇప్పటికే తనపై క్రిస్టియన్ మతం అనుకూలంగా ఉంటున్నారు అని వస్తున్న వార్తలకు తోడు జగన్ తీసుకున్న మరో నిర్ణయం ఏపీలో సంచలనం రేపుతోంది. ఇంగ్లీష్ మీడియం, ఫాస్టర్ల జీతాల అంశంతో జగన్‌పై క్ట్రిస్టియన్‌లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్న తరుణంలో… ఏపీ సర్కార్ విడుదల చేసిన జీవో తీవ్ర దుమారం రేపబోతుంది.
ఏపీ సర్కార్ తాజాగా జెరూసలేం యాత్రికుల ఆర్థికసాయాన్ని పెంచుతూ జీవో జారీ చేసింది. 3 లక్షల్లోపు ఆదాయం ఉన్న యాత్రికులకు ఇచ్చే సహయాన్ని 40వేల నుండి 60వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 3లక్షలకు పైగా ఆదాయం ఉన్న వారికి 20వేల ఆర్థిక సహయాన్ని 30 వేలకు పెంచుతూ అధికారిక ఉత్తర్వులు విడుదల చేసింది. ఒక్క జెరూసలేంకు మాత్రమే కాదు.. ఇతర క్రైస్తవ ప్రార్థనా స్థలాల సందర్శనకు కూడా ఆర్థిక సహయాన్ని ప్రకటించింది.
ఇప్పటికే ఏపీలో గుడి నిర్మాణాల కూల్చివేత జరుగుతోందని హిందూ సంఘాలతో పాటు బీజేపీ ఫైర్ అవుతోంది. జగన్ సర్కార్ నిర్ణయాలు ఓ మతాన్ని అభివృద్ధి చేసే దిశగా ఉన్నాయని… ఇది మంచిది కాదని ఫైర్ అవుతున్నాయి. ఇంగ్లీష్ మీడియం పాఠశాలల అంశంలోనూ బీజేపీ జగన్ సర్కార్ నిర్ణయాన్ని సూటిగానే ప్రశ్నించింది. హిడెన్ ఏజెండా ఉన్నట్లుందని విమర్శించింది. ఇప్పుడు తాజాగా ఓ మత ప్రార్థనలకు వెళ్లే యాత్రకు మాత్రమే సహయాన్ని పెంచటం… పైగా ఇన్ని విమర్శలు వస్తున్న దశలో జీవో రిలీజ్ చేయడాన్ని రెచ్చగొట్టినట్లుగానే భావించాలంటున్నారు రాజకీయ విశ్లేషకులు.