ఆంధ్ర ప్రదేశ్ లో మరోసారి సంక్రాంతి సెలవుల్లో మార్పు చోటు చేసుకుంది. ఏపీ ప్రభుత్వం మరోసారి సంక్రాంతి సెలవులను మార్చింది. మొదట 11వ తేదీ నుంచి 16వ తేదీ వరకూ విద్యాసంస్థలకు ఏపీ ప్రభుత్వం సెలవులను ప్రకటించింది. అయితే మళ్లీ ఆ సెలవులను ఈ నెల 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకూ మార్చేసింది.
అంటే మొత్తం ఐదు రోజులు స్కూళ్లకు సెలవులు ఇచ్చింది ప్రభుత్వం. 18వ తేదీ నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. అయితే ఏపీ సర్కార్ మొదట 11వ తేదీ నుంచి సెలవులు ఉంటాయనడంతో 10వ తేదీన కుటుంబాలతో.. స్వగ్రామాలకు వెళ్లేందుకు బస్సు, రైలు ప్రయాణానికి రిజర్వేషన్లు చేయించుకున్నారు.
అసలే సంక్రాంతి అంటేనే టఫ్ టైమ్. ఈ సమయంలో సెలవులు మారడంతో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళానికి గురవుతున్నారు.
మళ్లీ రిజర్వేషన్లు ఎలా దొరుకుతాయని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు. అకస్మాత్తుగా సెలవు తేదీ 12వ తేదీకి మార్చడంపై ఏపీటీఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఉపాధ్యాయులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఏపీటీఎఫ్ ఆరోపిస్తోంది.