ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదల పై సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన ఈ పిటిషన్ పై మంగళవారం సుప్రీమ్ కోర్ట్ విచారణ చేపట్టనుంది. ఏపీ లో స్థానిక సంస్థల ఎన్నికల నిలుపుదల అంశాన్ని జస్టిస్ లలిత్ ధర్మాసనం ముందు ఏపీ ప్రభుత్వ న్యాయవాదులు ప్రస్తావించనున్నారు. మంగళవారం నాటి కేసుల జాబితాలో చేర్చాలని సుప్రీంకోర్టు రిజిస్ట్రార్ ను ఇప్పటికే జస్టిస్ లలిత్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండా కరోనా వైరస్ పేరుతో ఆరు వారాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల అధికారి వాయిదా వేయడాన్ని తప్పుబడుతూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.