అంతరాష్ట్ర ప్రయాణికులకు ఏపీ ప్రభుత్వం మరిన్ని సడలింపులు ఇచ్చింది. ఇప్పటి వరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు స్పందన వెబ్సైట్ లో నమోదు చేసుకొని… పోలీస్ పర్మిషన్ ఉంటేనే అనుమతి ఇచ్చే వారు. కానీ అన్ లాక్ 3.0 సడలింపుల తర్వాత ఏపీ ప్రభుత్వం అంతరాష్ట్ర ప్రయాణికులకు సడలింపులు ఇచ్చింది.
శనివారం నుండి స్పందన వెబ్ సైట్ లో నమోదు చేసుకున్న వారికి ఆటోమేటిక్ గా పాస్ జారీ అయిపోతుందని, సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద ఐడి కార్డు చూపించి, స్పందన వెబ్ సైట్ నుండి వచ్చిన ఈ పాస్ చూపాలని ఆదేశించారు. ఈ వివరాల ఆధారంగా…. వైద్య అధికారులు వారిని ట్రేస్ చేసి, హోమ్ క్వరెంటైన్ లో ఉంచుతారని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది.