ఇంగ్లీష్‌ విద్య- అమలు ఎలా...? - Tolivelugu

ఇంగ్లీష్‌ విద్య- అమలు ఎలా…?

Ap govt going to implements English medium from next year with central funds, ఇంగ్లీష్‌ విద్య- అమలు ఎలా…?

ఏపీలో ప్రవేశపెట్టాలనుకుంటున్న ఇంగ్లీష్ విద్య ఎలా అమలు చేయబోతున్నారు…? ఆరవ తరగతి వరకు ఒకేసారి ప్రవేశపెట్టి… ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఓ తరగతి పెంచాలన్న ఆలోచన ఎలా వచ్చింది…? తెలుగు మీడియం టీచర్లు ఇంగ్లీష్ మీడియం ఎలా భోదిస్తారు…? అసలు ఇంగ్లీష్ విద్యకు లోటు బడ్జేట్‌లో ఉన్న ఏపీ నిధులు ఎక్కడి నుండి తెస్తుంది…?

సీఎం జగన్ మానసపుత్రికగా తెరపైకి తెచ్చిన ఇంగ్లీష్ మీడియం విద్య ఎలా అమలు చేయబోతున్నారు అనే అంశంపై ఏపీ ప్రభుత్వం ఓ అంచనాకు వచ్చింది. వచ్చే విద్యాసంవత్సరం నుండి నిర్భంద ఇంగ్లీష్‌ మీడియంను అమలు చేయబోతున్న ఏపీ సర్కార్… విద్యా సంవత్సరం ముగియగానే… ప్రభుత్వ టీచర్లకు ఇంగ్లీష్‌ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేయబోతున్నారు. ఫాస్ట్‌ట్రాక్‌లో ట్రైనింగ్ ప్రోగ్రాం కొనసాగనుండగా ఈ ట్రైనింగ్ సెషన్స్‌కు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇంగ్లీష్, మైసూర్ రీజినల్ ఇంగ్లీష్‌ సంస్థ హెల్ప్ తీసుకోబోతున్నారు.

సీబీఎస్‌ఈ స్టాండర్స్‌ అమలులోకి వచ్చేలా సెలబస్‌ మార్పు, సెలబస్ ఎలా ఉండాలి అనే అంశాలను కూడా ఈ సంస్థలే కోఆర్డినేట్ చేయబోతున్నాయి. ఇంగ్లీష్ మీడియం అమలుకు ఏపీ సర్కార్ కేంద్రంపైనే ఆధారపడనుంది. కేంద్రం నుండి వచ్చే సర్వశిక్ష అభియాన్‌ నిధులను ఇంగ్లీష్ విద్య కోసం వాడుకోబోతున్నట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.

సెలబస్ ఎలా ఉండాలి అనే అంశంపై ఇప్పటికే కొంత చర్చ సాగినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహరంలో విద్యాశాఖ సలహాదారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ దగ్గరుండి ఈ మొత్తం ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు.

Share on facebook
Share on twitter
Share on whatsapp