ఏపీలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులకు గుడ్ న్యూస్ అందించింది రాష్ట్ర ప్రభుత్వం. పదో తరగతి విద్యార్దులకు సంబంధించిన మెమెలను బోర్డు వెబ్ సైట్ లో అప్ లోడ్ చేసింది. కరోనా ప్రభావంతో పరీక్షలు లేకుండానే విద్యార్దులను పాస్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఇంటర్ బోర్డు మార్క్స్ మెమోలను అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. 10వ తరగతి విద్యార్థులు www.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లో ఎస్ఎస్‌సీ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇంటర్నల్ మార్క్స్, మెరిట్ ఆధారంగా ఫలితాలను విడుదల చేశారు. ప్రస్తుతం మార్క్స్ మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాంగ్ మెమోలను సంబంధిత స్కూళ్లకు పంపనుంది. విద్యార్థులు తమ స్కూళ్ల నుంచి ఒరిజినల్ మార్క్స్ మెమోలు కలెక్ట్ చేసుకోవచ్చు.