గుంటూరు: పంచాయతీరాజ్ శాఖలో భారీగా చేపట్టిన రోడ్ల పనులన్నీ నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రూ.1031.17 కోట్ల విలువైన పనులను తక్షణం నిలిపివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. దీంతో 13 జిల్లాల్లో 3,543 పనులు నిలిచిపోయాయి. పంచాయతీరాజ్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద అనుమతి పొందిన పనులనే నిలిపివేశారు. ఈ ఏడాది ఏప్రిల్ ఒకటికి ముందే ఈ పనులకు అనుమతి పొందినా ప్రారంభం కాకపోవడంతో నిలిపివేస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.