ఏపీలో కరోనా వైరస్ తీవ్రత క్రమంగా పెరుగుతోంది. తాజా విజృంభణణు సెకండ్ వేవ్‌గా భావిస్తున్న రాష్ట్రాలు క్రమంగా కరోనా టెస్టులు పెంచుతున్నా.. ఏపీ మాత్రం పట్టనట్టే ఉండిపోయింది. చాలా రోజులుగా 30 నుంచి 40 వేల మధ్య టెస్టులకే పరిమితమవుతోంది. గడచిన 24 గంటల్లో కూడా 35, 375 మందికే కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఇందులో 310 మందిలో పాజిటివ్ తేలింది.
క
రోనా కారణంగా కొత్తగా కృష్ణా, కర్నూలు జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఇద్దరు మృతిచెందారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కరోనా కేసులు 8,94,044కి చేరాయి. ఇక కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 7,191కి పెరిగింది.
కరోనా నుంచి తాజాగా 114 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,382 యాక్టివ్ కేసులున్నాయి. ఇక ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కోటీ 47 లక్షల 71 వేలకు పైగా కరోనా టెస్టులు నిర్వహించారు. కాగా గతంలో అన్ని రాష్ట్రాల్లో కంటే అత్యధికంగా, వేగంగా టెస్టులు చేసి రికార్డ్ సృష్టించి ఏపీ.. ఇప్పుడు లైట్ తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.