విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారు అంటే ఎంతో భక్తి. పైగా ఇప్పుడు నవరాత్రులు మొదలు కాబోతున్నాయి. అయితే, దసరా మహోత్సవంలో భాగంగా… ఇంద్రకీలాద్రిపై షెడ్ నిర్మాణం జరుగుతోంది. ప్రమాదవశాత్తు ఓ కూలీ పై నుండి పడి చనిపోయారు. అయితే దీన్ని అధికారులు గోప్యంగా ఉంచుతున్నట్లు తెలుస్తోంది. పైగా చనిపోయిన ప్రదేశంలో ఉన్న రక్తపు మరకలపై ఇసుక వేసి కప్పి ఉంచారు. దాంతో భక్తులంతా ఆ రక్తపుమరకలపై నుండే అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు. దీనిపై భక్తులు మండిపడుతున్నారు. అధికారులు, ఈవో, మంత్రిగారికి ఎందుకింత నిర్లక్ష్యం, ఇప్పుడే ఇలా ఉంటే దసరా ఉత్సవానికి ఇంకెన్ని అనర్థాలు చూడాల్సి వస్తుందోనని భక్తులు అభిప్రాయపడుతున్నారు.