వైజాక్ విషవాయువు లీకేజీ అవ్వడం తో వందల మంది అస్వస్థతకు గురయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటికే 80 మంది వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నారు. 3 వందల మంది హాస్పిటల్స్ లో చికిత్స అందిస్తున్నట్లుగా ప్రభుత్వం చెప్తుంది. కానీ ప్రభుత్వ లెక్కలకు స్థానికంగా ఉన్న పరిస్థితులకు చాలా తేడా ఉంది అంటున్నారు అక్కడి ప్రజలు. ప్రభుత్వం చాలా ఆలస్యంగా స్పందించిందని ఆరోపిస్తున్నారు. 5 గ్రామాల ప్రజలు చాలా మంది అస్వస్థతకు గురయ్యారని, ఇప్పటికే 20 మందికి పైగా చనిపోయారని వార్తలు వస్తున్నాయి. గ్యాస్ లీక్ అయ్యింది అని తెలిసి కట్టు బట్టలతో రోడ్లపైకి పరుగులు తీసిన చాలా మంది శ్వాస సమస్యతో మురికి కాలువల్లో పడిపోయారని అంటున్నారు.
గ్యాస్ లీకేజీ అయ్యిందని తెలుసుకొని పరుగులు తీసి చాలా మంది ప్రాణాలు కపడుకున్నారు. కానీ ఇంకా ఇండ్లలోనే ఉన్నవాళ్ల పరిస్థితి ఆలోచిస్తేనే భయమేస్తోంది అంటున్నారు స్థానికులు. చాలా మంది తలుపులు మూసుకొని నిద్రలో ఉండి పోయారు అలాంటి వాళ్ళను కాపాడటంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది. ఉదయం 3.20 నిమిషాలకు గ్యాస్ లీక్ అయితే సర్చ్ ఆపరేషన్ మాత్రం 11 గంటలకు మొదలు పెట్టారు. అంటే దాదాపు గా 7 గంటల సమయం తరువాత సర్చ్ మొదలు పెట్టారు. ఆ సమయంలో నిద్ర లేవక విషవాయువుతో స్పృహ కోల్పోయి ఉంటే ఇన్ని గంటలపాటు వాళ్ళు బ్రతికే అవకాశం చాలా తక్కువ. అలా ఇండ్లలోనే ఎంత మంది ఉన్నారో ఇంకా లెక్కతేలాల్సి ఉంది.