రేషన్ పంపిణీపై ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. జనవరి నుంచి రేషన్ సరుకులను డైరెక్ట్‌గా వినియోగదారుల ఇంటికే పంపించే ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు సంబంధించిన మినీ వ్యాన్లను ప్రభుత్వం కొనుగోలు చేయగా… జైపూర్ నుంచి గుంటూరుకు చేరుకున్నాయి.
పైలట్ ప్రాజెక్ట్ కింద తొలుత శ్రీకాకుళంలో డోర్ డెలివరీ కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది. ఆ తర్వా జనవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోని ఇంటికే చేరవేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం మొత్తం 9,260 మినీ వ్యాన్లను కొనుగోలు చేసింది. త్వరలోనే వీటికి డ్రైవర్లను కూడా ప్రభుత్వం నియమించబోతోంది.