ఏపీలో 4 జోన్ల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. విజయనగరం, కాకినాడ, గుంటూరు, కడప కేంద్రాలుగా ఈ జోన్లను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ప్రతి జోన్‌కు ఓ బోర్డును ఏర్పాటు చేస్తూ.. బోర్డు పరిధిలో కేబినెట్ హోదా ఉన్న చైర్మన్‌తో పాటు ఏడుగురు సభ్యులకు చోటు కల్పించనుంది.
మరోవైపు CRDA రద్దు చట్టం ఆమోదం పొందటంతో దాని స్థానంలో.. అమరావతి మెట్రోపాలిటీన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ (AMRDA) ని నోటిఫై చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు జారీ చేసింది. CRDA పరిధి అంతా ఇకపై AMRDA పరిధిలోనికి వస్తుందని తెలిపింది.
పురపాలక శాఖ కార్యదర్శి ఉపాధ్యక్షుడు, 11 మంది అధికారులు సభ్యులుగా.. AMRDA కమిటీ ఏర్పాటు చేసింది. కమిటీలో ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, AMRDA కమిషనర్, గుంటూరు, కృష్ణా జిల్లా కలెక్టర్లు, డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్‌లు సభ్యులుగా నియమించారు. అలాగే AMRDAకు కమిషనర్‌గా లక్ష్మీ నరసింహంను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది