ఏపీలో భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈమేరకు గ్రామ సచివాయలయాల్లో ఖాళీగా ఉన్న వీఆర్వో పోస్టులను భర్తీ చేసేందుకు తాజాగా నోటిఫికేషన్ విడుదల అయింది. గ్రామ సచివాలయాల్లో ఖాళీగా ఉన్న మొత్తం 246 వీఆర్వో పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పదోతరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రాత పరీక్ష ఆధారంగా నియామకాలు చేపట్టనున్నారు. జనవరి 11 నుంచే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైందని.. ఈనెల 31 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ అని ప్రకటించారు.