అనుకున్నట్లుగా ఏపీలో విద్యుత్ చార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 500 యూనిట్లకు మించి వినియోగ దారులు విద్యుత్ ఉపయోగించే వారిపై యూనిట్ కు అదనంగా 90 పైసలు పెంచనున్నారు. 500 యూనిట్ లోపు వాడే వినియోగదారులపై ఎటువంటి భారం ఉండదు. టారిఫ్ ను 9 రూపాయల ఐదు పైసలు నుంచి 9 రూపాయల 95 పైసలకు పెంచారు. విద్యుత్ కు సంబంధించి ఇక నుంచి ప్రభుత్వం, కార్పొరేట్ సంస్థలపై విద్యుత్ భారం పడనుంది.
కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యుత్ సంస్థలు పీకల్లోతూ అప్పుల్లో ఉన్నామని సంస్థలు ప్రభుత్వంతో మొరపెట్టుకున్న నేపథ్యంలో… ప్రభుత్వం పేదలపై ఇబ్బంది పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కనపడుతోంది.