కరోనా వైరస్ కారణంగా భారత దేశం అల్లకల్లోలంగా మారింది. వైరస్ వ్యాప్తిని నివారించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటిచాయి. లాక్ డౌన్ నేపథ్యంలో ఎక్కడికక్కడే అన్ని రంగాలు, ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు సైతం మూసివేశారు. దీనితో తెలుగు రాష్ట్రాల్లో సైతం ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోతలు, విధాతలు చేశారు.
తాజాగా ఏపీలో మే నెల కు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లు, ప్రభుత్వ రంగ సంస్థలు ఉద్యోగులకు పూర్తి వేతనాల చెల్లింపునకు ఆర్ధిక శాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. మే నెలకు చెందిన జీతాన్నీ వందశాతం జూన్ 1 తేదీన చెల్లించనున్నట్టు ఉత్తర్వుల్లో ఆర్ధిక శాఖ పేర్కొంది. వేతనాల చెల్లింపుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ట్రెజరీ, సీఎఫ్ఎంఎస్ కు ఆదేశాలు జారీ చేసింది.