ఏపీలో టీడీపీ నేతల భద్రతను తొలగిస్తూ సర్కార్ నిర్ణయ తీసుకుంది. మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి, మాజీ మంత్రులు నక్కా ఆనంద్‌బాబు, ప్రత్తి పుల్లారావు, కాల్వ శ్రీనివాసులు, పల్లె రఘునాథ్‌బాబులకు సెక్యూరిటీ తొలగించారు. ఈ జాబితాలో పలువురు మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ, దేవినేని ఉమకు కూడా భద్రత ఉపసంహరించారు.
అయితే, స్టేట్ సెక్యూరిటీ రివ్యూ కమిటీ ఆదేశాలతోనే భద్రతను తొలగించామని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఈ చర్యలపై టీడీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వాన్ని అడ్డంపెట్టుకొని… కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, వైసీపీని విమర్శించే నేతల నోరు మూయించటానికే ఇలాంటి చర్యలను ఆరోపిస్తున్నారు.
ఇప్పటికే మాజీ సీఎం చంద్రబాబుతో పాటు లోకేష్ భద్రతను కుదించిన ఏపీ సర్కార్, తాజాగా తాజా మాజీలకు భద్రతను ఉపసంహరించటం చర్చనీయాంశం అవుతోంది.